సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర – ధర్మవరం : సిపిఎం సీనియర్ నాయకుడు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు మృతి తీరని లోటు అని సిపిఐ-శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, నియోజకవర్గ కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారి మృతికి సంతాపం తెలుపుతూ, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ అంతిమ యాత్రలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయ ఆనంద్, సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, జిల్లా నాయకురాలు దిల్షాద్, తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తో పాటు జింక చలపతి మాట్లాడుతూ కీర్తిశేషులు పోలా రామాంజనేయులు ప్రజల తరఫున తోపాటు చేనేత పరిశ్రమను కాపాడుకునేందుకు చేనేత కార్మికులు అందర్నీ ఏకధాటిగా నడిపిస్తూ, మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. చేనేత పరిశ్రమను కాపాడుకోవడంలో వారు చేసిన కృషి అనన్య నియమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జేవి రమణ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయప్ప, జిల్లా అధ్యక్షులు రాజా, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ సహాయ కార్యదర్శి రమణ చేనేత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటనారాయణ, వెంకటస్వామి, శ్రీధర, సురేష్, రంగయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు పోతులయ్య, శివ, విజయ భాస్కర్, సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దన్న, ఆదినారాయణ నాగేంద్ర నాగభూషణం ఎస్హెచ్ భాష ఆయుఖాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాబ్జాన్, జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్, ఇమ్రాన్, అనిల్ కుమార్, జిల్లాలోని వామపక్ష నాయకులు, కార్యకర్తలు, ఇతరత్రా రాజకీయ పార్టీ నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.