Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

ప్రజలకు నిజమైన సేవ చేయడమే రాజకీయం

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజలకు నిజమైన సేవ చేయడమే రాజకీయమని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు తమ వ్యక్తిగత కార్యాలయంలో శనివారం నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు సమావేశాలు నిర్వహించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకులు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యం, అక్రమ ఆర్జన లాంటి విషయాలను గోనుగుంట్ల దృష్టికి తెచ్చారు. తదనంతరం గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు సేవా మార్గముగా కాకుండా రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకుని రౌడీయిజం గూండాయిజం చేసి ప్రజలను దోచుకోవడం జరుగుతుందని, ఆ పద్ధతి చాలా దారుణమని మండిపడ్డారు. కష్టపడి సంపాదించి ప్రజలకు అండగా నిలబడాలనేదే రాజకీయమని వారు తెలియజేశారు. గతంలో నియోజకవర్గ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారని, 2024లో కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని వారు తెలిపారు. అభివృద్ధి జరగాలి అంటే ప్రజల సమస్యలను తెలుసుకొని, కష్టపడి పనిచేసి, ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా పనిచేసిన వారే ఎమ్మెల్యే అని తెలిపారు. నేడు నియోజకవర్గ ప్రజలు కూడా కేతిరెడ్డి పాలన చూస్తున్నారని, ప్రజలు కూడా విసుగు చెందారని తెలిపారు. కబ్జాలు, దౌర్జన్యాలు నా హయాములో తప్పక అరికెడతానని తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు బిజెపి కార్యాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగు తోందని, ఇందుకు ప్రజల స్పందనకు నా కృతజ్ఞతలను తెలుపుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిష్ రాజు, తుంపర్తి పరమేష్, అరవింద్ రెడ్డి, నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img