విశాలాంధ్ర-రాప్తాడు : విద్యార్థులు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుందని పీహెచ్సీ సీహెచ్ఓ శివప్రసాద్ తెలిపారు. స్థానిక ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పద్మజాదేవి ఆధ్వర్యంలో బుధవారం 10-19 వయసు ఉన్న దాదాపు 280మంది ఆడపిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్ష, బరువు, ఎత్తును పరిశీలించారు. స్వల్ప రక్తహీనత వున్న వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రక్తహీనతకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, అదేవిధంగా ప్రతి గురువారం ఇచ్చే ఐరన్ టాబ్లెట్ తప్పక వాడాలన్నారు. లేనిపక్షంలో రక్తహీనతతో అనారోగ్యానికి గురవుతారన్నారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ లక్ష్మి, ఏఎన్ఎంలు శ్రీదేవి, లీలావతి, ఎంపీహెచ్ఏలు నారాయణస్వామి, కంబగిరిస్వామి, ఆశా కార్యకర్తలు అరుణ, సువర్ణ పాల్గొన్నారు.