Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి

విశాలాంధ్ర- తాడిపత్రి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణను ఆపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారము పట్టణం లోని ఆర్ అండ్ బి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రనికి జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితు లకు పరిహారం విషయాలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి.
కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్ ప్రభుత్వం గోరంగా విఫలమైంది. కేంద్రలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు, బిల్లులకు జగన్ సర్కార్ నిస్సిగ్గుగా మద్దతిస్తోంది. మహిళలు,చిన్నపిల్లలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోయాయి. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, జర్నలిస్టులపై దాడులు నిత్య కృత్యమై పోయాయి. కావున రాష్ట్రాన్ని రక్షించు కుందాం దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా ప్రచార జాత నిర్వహి స్తున్నది. కావున ప్రతి సిపిఐ కార్యకర్త, నాయకులు, ప్రజా సంఘాలు ప్రచార జాతను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా, అధ్యక్ష కార్య దర్శులు రంగయ్య, కేశవరెడ్డి, గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు వైయల్. రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి, పట్టణ సహాయ కార్యదర్శి శ్రీరాములు, మండల కార్యదర్శి నాగ రంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం శింగనమల నియోజవర్గం కార్యదర్శి శీనా లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img