Friday, December 8, 2023
Friday, December 8, 2023

పేద ప్రజలకు రక్ష… జగనన్న ఆరోగ్య సురక్ష

విశాలాంధ్ర, ముదిగుబ్బ : మండల కేంద్రంలోని సచివాలయం -4 పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు గొ డ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, మండల కన్వీనర్ సివి నారాయణరెడ్డిలు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదోళ్ల ఆరోగ్యానికి అత్యంత రక్షణ కల్పిస్తున్నట్లు, అదేవిధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం నుంచి పుట్టిన అద్భుత పథకమని, ఈ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారుఅని స్పష్టం చేశారు, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవరకొండ లక్ష్మీదేవి చండ్రాయుడు , వైస్ ఎంపీపీలు మండల అధికారులు,సీనియర్ డాక్టర్లు, వైద్యాధికారులు, ముదిగుబ్బ మండల సచివాలయాల కన్వీనర్ మ ల్లగుండ్ల భాస్కర్, జడ్పిటిసి తిరుమల సేవే నాయక్,నర్సులు, ఆశా వర్కర్లు,సచివాలయ సిబ్బంది, వాలంటరీలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img