సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, అయుబ్ కాన్
విశాలాంధ్ర – ధర్మవరం:: మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సిఐటియు పిలుపుమేరకు సోమవారం మున్సిపల్ కార్మికులు నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం దారుణమని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఊరు దిబ్బ పేరు గొప్ప అన్నట్లుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క మంత్రులు గొప్పలు చెప్పుకోవడమే తప్ప, అమలు చేయడంలో ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారు అర్థం కావడం లేదని వారు మండిపడ్డారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో మున్ముందు పెద్ద ఎత్తున పోరాటాలు సంపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఎం ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున తో పాటు సేక్షావలి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు బాబు, చెన్నకేశవులు, గౌరవ అధ్యక్షులు పుల్లన్న, ప్రసాద్, ముకుంద, వెంకటేష్, వెంకట రాముడు తదితర నాయకులు, కార్మికులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.