Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ప్రయాణికులకు రైళ్ల సౌకర్యం,ప్లాట్ఫారం సౌకర్యం, మౌలిక సదుపాయాలు కల్పించండి

గుంతకల్లు డిఆర్ ఎం కి వినతి….

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : గుత్తి రైల్వేస్టేషన్లో ప్లాట్ ఫారంలు, షెల్టర్ లు ,మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ సిపిఐ నాయకులతో కలిసి బుధవారం గుంతకల్లు రైల్వే డి.ఆర్.ఎం కార్యాలయంలో డి.ఆర్.ఎం వెంకటరమణారెడ్డికి రైల్వే సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ…గుత్తి రైల్వే స్టేషన్లో చాలా కాలం నుండి రెండు రైల్వే ప్లాట్ఫారంలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎక్కువ ప్లాట్ఫారంలు లేనందు వల్ల వచ్చిన రైళ్లకు ప్లాట్ఫారం లేక ఔటర్ లో నిలుపుతున్నారని అన్నారు. అందువల్ల రైలు ఆలస్యంగా నడపవలసి వస్తుందన్నారు. ఈ సమస్యను రైల్వే అధికారులు గుర్తించి మరో రెండు ఫ్లాట్ ఫారంలను నిర్మించారని కానీ నూతన ప్లాట్ ఫారంల యందు రైళ్ల రాకపోకలను ఇంకా పునరుద్ధరించలేదని అన్నారు కావున తక్షణమే గుత్తి రైల్వేస్టేషన్లో నాలుగు ప్లాట్ఫారంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా గుత్తి పోర్ట్ రైల్వే స్టేషన్లో నిలువ నీడ కూడా లేనందువల్ల చంటి బిడ్డలు,తల్లులు,వృద్ధులు ప్రయాణికులు గురవుతున్నారన్నారు. కావున గుత్తి కోర్టు రైల్వే స్టేషన్లో పైకప్పు వేసి ప్రయాణికులకు నీడ కల్పించాలని కోరారు. అదేవిధంగా స్టేషన్లో డిస్ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులు ఎక్కువమంది ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణిస్తుంటారని ప్యాసింజర్ రైళ్లు సమయానికి రావడంలేదని అన్నారు. ఉదాహరణకు ట్రైన్ నెంబర్ 07655 తిరుపతి స్పెషల్ ప్యాసింజర్ రైళ్లకు గుంతకల్ నుండి వందల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారని అన్నారు. ఈ రైళ్లు గతంలో గుంతకల్ నుండి బయలుదేరేది అన్నారు. ఇప్పుడు మంత్రాలయం నుండి బయలుదేరే విధంగా మార్పులు చేశారన్నారు.ప్రతిరోజు చాలా ఆలస్యంగా వస్తుందని కావున దీనిని మరల మార్పు చేసి గుంతకల్లు తిరుపతి రైలుగా మార్చి గుంతకల్ నుండి సమయానికి బయలుదేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా అనంతపురం రైల్వే స్టేషన్లో రెండు మూడు ప్లాట్ఫారంల గుండా చాలా రైళ్ల ఇతర ప్రాంతాలకు పోతున్నాయని ఈ ప్లాట్ ఫారం లో యందు వందల మంది ప్రయాణికులు రైళ్ళ కోసం వేచి ఉంటారన్నారు. కానీ ఇక్కడ ఒకటి కూడా టాయిలెట్స్ మూత్రశాలలు లేవన్నారు. ప్రయాణికులు మూత్రశాలకు వెళ్లాలంటే ఒకటవ ప్లాట్ఫారం కు వెళ్లాల్సి ఉందన్నారు. రెండు మూడు ప్లాట్ఫారంలలో ఎక్స్ లెటర్ లిఫ్టు లేదన్నారు మెట్లు ఎక్కి దిగవలసి ఉంటుందన్నారు. వృద్ధులకు మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. అందువల్ల ప్లాట్ ఫారం లో టాయిలెట్స్ నిర్మాణం చేయాలని కోరారు. రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు 60 సంవత్సరాలు పైబడిన వారికి టికెట్పై రాయితీ ఇచ్చేవారని అయితే కరోనా సమయంలో రాయితీని తీసేసారని అన్నారు.మరల వృద్ధులకు టికెట్పై రాయితీని పునరుద్దించాలని కోరారు.గుంతకల్లు ధర్మవరం గేట్ రైళ్ల రాకపోకలు ఎక్కువ అయినందున రైల్వే గేటు వేసినప్పుడల్లా ట్రాఫిక్ స్తంభించి పోతుందన్నారు. కావున ఈ గేట్ క్రింద భూగర్భ రహదారిని ఏర్పాటు చేయాలని రైల్వే డిఆర్ఎన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img