Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు విధిగా అందించాలి

కలెక్టర్ అరుణ్ బాబు

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విధిగా అందించాలని శ్రీ సత్య సాయి కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయమును తనిఖీ చేశారు. తదుపరి మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ బండి శేషన్న ద్వారా అడిగి తెలుసుకున్నారు. తదుపరి కౌన్సిల్ హాలులో విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, అమినాష్ లకు, హౌసింగ్ సిబ్బందికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 20వేల రూపాయలు అదనంగా ప్రకటించిందని ఆ ప్రకారం ఇళ్ల నిర్మాణాలు త్వరితగతింగా అధికారులు పూర్తి చేయాలని వారు ఆదేశించారు. జగనన్న సురక్ష పథకాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ఆ కార్యక్రమము యొక్క ప్రయోజనాలను వివరించాల్సిన బాధ్యత అధికారుల ది, సిబ్బంది దేనని వారు తెలిపారు. ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని వారు మరొక్కసారి గుర్తు చేశారు. అంతకుమునుపు మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి మర్యాదపూర్వకంగా కలెక్టర్ కు పుష్ప గుచ్చం మిచ్చి అభినందనలు తెలియజేశారు. ఇళ్ళ నిర్మాణంలో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా, అన్ని వసతులను ఉండే విధంగా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో పూర్తి చేసి విజయవంతం చేయాలని తెలిపారు. లబ్ధిదారుల ద్వారా ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణంలో తలెత్తే సమస్యలను, పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తిప్పే నాయక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హౌసింగ్ పీడీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్థానిక డి ఈ మునీశ్వర నాయుడు, ఏఈ బాలాజీ, తాసిల్దార్ యుగేశ్వరీ దేవి, మున్సిపల్ మేనేజర్ ఆనంద్, తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img