Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

సర్పంచ్ వెంకటేశ్వర్లు

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యంగా రుచికరంగా విద్యార్థులకు అందించాలని గ్రామ సర్పంచి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని అయ్యవారిపల్లి ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు తో పాటు ఉపసర్పంచ్ మద్దులూరి కొండలరావు సచివాలయ కార్యదర్శి రవికుమార్ సచివాలయం ఉద్యోగులు పరిశీలించారు ముందుగా భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తున్నారని తల్లిదండ్రుల ఆందోళన చెందవ వసరం లేదని పిల్లలను పాఠశాలకు పంపించాలని పిలుపు ఇచ్చారు ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను అంగన్వాడీ కార్యకర్త సుమలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్షమని పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి మూడు సంవత్సరాల వరకు పాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంగనవాడి కార్యకర్తలు తల్లులు గర్భవతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img