విశాలాంధ్ర – ధర్మవరం : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సోమవారం భారతీయ జాతీయ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు చైతన్య మాట్లాడుతూ దేశంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించి, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజులు సుదీర్ఘ భారత్ జూడో యాత్ర చేపట్టి,రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ, వారి సమస్యలను వింటూ వారి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మతం పేరుతో రాజకీయాలు చేస్తూ దేశ ప్రజలను విడదీస్తూ తమ రాజకీయ భవం గడుపుకోవడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ దేశ సంపదలు ప్రధాని అంబానీలకు కట్టబెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ తో పాటు అధికమంది ఎన్ ఎస్ యు ఐ సంఘం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.