Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

రైల్వే ఎస్పి ఆన్లైన్లో నేర సమీక్ష సమావేశం

విశాలాంధ్ర – గుంతకల్లు : రైల్వే ఎస్పీ కార్యాలయంలో సోమవారం రైల్వే ఎస్పీ కే. చౌడేశ్వరి ఆన్లైన్లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ చౌడేశ్వరి మాట్లాడుతూ..పాత నేరాలు, వాటి దర్యాప్తు, అరెస్టు చేసిన నేరస్తులు, స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు మరియు ఇంకా డిటెక్షన్ కావలసిన పాత కేసులను దర్యాప్తు చేయవలసిన విధానం గురించి జిల్లా పరిధిలోని డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక బృందాలతో చర్చించి, తగు సూచనలు జారీ చేశారు.
పెండింగ్‌లో ఉన్న అరెస్టు వారెంట్లు మరియు సమన్లు గురించి సమీక్షించి వాటిని వెంటనే అమలు చేయాలని సూచించారు. హిస్టరీ షీట్లు కలిగిన పాత నేరస్తులను పై నిఘావుంచి, వాళ్లు మరలా నేరాలుకు పాల్పడకుండా తరచుగా తనిఖీ చేయాలని ఆదేశించారు.గత 2 సంవత్సరాల కాలం లో దొంగతనం కేసులలో ఒకసారి అరెస్టు అయి, జైలు నుండి విడుదలై మరలా నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను గురించి సమీక్ష చేసి, అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించి, వారిపై హిస్టరీ సీట్లు తెరిచి, నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు,ఆర్ పి ఎఫ్ అధికారుల సమన్వయంతో, రైల్వే స్టేషన్లు, మరియు నేరస్తులు సంచరించే ప్రాంతాలలో ఉమ్మడిగా గస్తీ నిర్వహిస్తూ, నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించవలని తిరుపతి రైల్వే డి.ఎస్.ఆర్.పి షేక్ షానుని ఆదేశించారు.గంజాయి అక్రమ రవాణా కేసులను సమీక్షించి,పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకోవాలని, గంజాయి అక్రమ రవాణా గురించి లా అండ్ ఆర్డర్ పోలీసుల, ఆర్పిఎఫ్ , సెబ్ అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించి గంజాయి అక్రమ రవాణా చేసే వారిని పట్టుకోవాలని సూచించారు. నెల్లూరు డిఎస్ఆర్పి మల్లికార్జున రావు ని ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకొని గంజాయి అక్రమ రవాణా చేసేవారిని పట్టుకోవాలని ఆదేశించారు.రాత్రిపూట రైళ్లలో నేరాలు జరగకుండా చూసేందుకు ఎస్పీ ప్రత్యేక చొరవతో అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించి, రైళ్లలోను, రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలు మరియు నేరాలు జరిగే అవకాశాలు ఉన్న పలు ప్రాంతాలలో పోలీసుల గస్తీని ముమ్మరం చేసి మరియు నేరస్థులు కదలికలపై సస్పెక్ట్ మాంటరింగ్ సిస్టంమ్, పింగర్ ఫ్రింట్ ఐడెంటిపికెషన్ నెట్వర్క్ సిస్టమ్, జైల్ రిలీస్ మాంటరింగ్ సిస్టమ్ వగైరా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా నేరస్తుల కదలికలపై గట్టి నిఘా ఉంచి పోలీసుల గస్తీని ముమ్మరం చేసి నేరాలు జరగకుండా చూడాలని సూచించారు.ఆధునిక టెక్నాలజీని గురించి అధికారులు మరియు సిబ్బంది అవగాహన పెంపొందించుకొని టెక్నాలజీ సహాయం తో నేరాలు, నేరస్తులను అదుపు చేసి, రైల్వే ప్రయాణికులకు గట్టి భద్రత కల్పించాలని సూచించారు.పెండింగ్ లో ఉన్న సిబ్బంది సమస్యల గురించి ఎస్పీ గారు చర్చించి, ఆ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రయత్నించాలని అడ్మినిస్ట్రేటివ్ అదికారి బి. శ్రీనివాస్ రావు ని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో గుంతకల్లు డిఎస్ ఆర్ పి షేక్ అబ్దుల్ అజీజ్, తిరుపతి డిఎస్ ఆర్ పి షేక్ షాను, నెల్లూరు డిఎస్ ఆర్ పి పి. మల్లికార్జున రావు, జిల్లాలోని ఇతర ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img