Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

పొగాకు వాడకం వల్ల వచ్చే నష్టం పై ర్యాలీ

డిప్యూటీ డిఎం హెచ్ ఓ సెల్వియా సాల్మన్

విశాలాంధ్ర – ధర్మవరం : పొగాకు వాడకం వల్ల వచ్చే నష్టాలు, భవిష్యత్తులో వారి యొక్క జీవన పరిస్థితిపై బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ సెల్వియా సాల్మాన్ ఆధ్వర్యంలో ర్యాలీగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకును తీసుకోవడం వలన లేదా తినడం వలన ఆరోగ్యానికి చాలా హానికరమని, ఈ అలవాటు మరణానికి కూడా దారి తీయడంతో పాటు, టీబీ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా గురి అవుతారని తెలిపారు. పొగ తాగే వారిలో సగం మంది పొగాకు సంబంధిత జగ్గులతో మృతి చెందుతున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితము సుఖవంతంగా ఉంటుందని తెలిపారు. ప్రజలందరూ పొగాకును వ్యతిరేకించాలని, సిగరెట్టు, బీడీ, గుట్కా లాంటివి తీసుకోకూడదని వారు తెలిపారు. ధూమపానం చేయడం వల్ల వారితోపాటు ఇతరులకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ పొగాకు వాడకంపై వైద్య సిబ్బంది పాఠశాలల్లో, కళాశాలలో, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నజీర్, వైష్ణవి, టీవీ యూనిట్, ఐ సి టి సి, ధర్మవరం అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఆశా వర్కర్లు, యునాని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img