చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేద్దాం
విశాలాంధ్ర -పెనుకొండ : మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 3 వ తేదీ న గొల్లపల్లి రిజర్వాయర్ పరిశీలనకు విచ్చేస్తున్నారు పర్యటనను విజయవంతం చేయాలని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి జగన్ – పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లు పేరుతో ఏ విదంగా వైస్సార్సీపీ ప్రభుత్వం,జగన్ రెడ్డి రాయలసీమ రైతాంగాన్ని ముంచాడు ప్రజల ముందు పెట్టడానికి రాయలసీమ పర్యటనకువస్తున్నాడు .అందులో భాగంగా ఉమ్మడి అనంతపూర్ లో 3 వ తేదీన పర్యటన ఉంటుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్ట్ ల కోసం 68,293 కోట్లు ఖర్చు పెడితే ,ఈ ప్రస్తుత వైస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రజా ద్రోహి గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయాడు .
ఇంకా రాయలసీమ విషయం లో ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం లో 12,441 కోట్లు ఖర్చు చేసి అనేక పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసి మొదటిసారి కృష్ణా నీళ్లు అనంతపూర్ కు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుంది.
అలాగే మన పెనుకొండ నియోజకవర్గం కు మడకశిర బ్రాంచ్ కెనాల్ లో అంతర్భాగం అయిన గొల్లపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసి పెనుకొండ నియోజకవర్గం లో అనేక చెరువులు నీళ్లు ఇచ్చిన రైతు బాంధవుడు నారా చంద్రబాబు నాయుడు అలాగే కియా ఇండస్ట్రియల్ హబ్ ద్వారా వేల మందికి ఉపాధి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది..
తర్వాత వచ్చిన వైస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అన్ని ప్రాజెక్ట్ లను రద్దు చేసి రాయలసీమ ద్రోహిగా జగన్ రెడ్డి రాయలసీమ చరిత్రలోనిలిచిపోయాడు.చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేద్దామని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.