విశాలాంధ్ర- ఉరవకొండ : విద్యా రంగానికి చేసిన సేవలకు మరియు వేలాది మంది విద్యార్థులకు బంగారు బాట వేసిన సాయిబాబా విద్యాసంస్థల చైర్మన్ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన ఎంవి రామచంద్రారెడ్డి మారిషస్ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం హర్షనీయమని ఉరవకొండ ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ అధ్యక్షులు రఘు రాములు తెలిపారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యా సంస్థలలో ప్రణాళిక బద్ధమైన బోధన, సిబ్బంది నిర్వహణలో మెరుగైన విధానాలు అమలు చేసినందుకు గాను మారిషస్ ప్రభుత్వం విద్యాశాఖ సహకారంతో ఇంటలిజెన్స్ మైండ్ ట్రస్ట్ 2023 సంవత్సరానికి ఎక్స్ లెన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అవార్డుకు ఎంపికయ్యి ఆగస్టు 23వ తేదీన మారిషస్ సెక్రటరీయేట్లో ఆ దేశ అధ్యక్షులు పృథ్వీరాజ్ సింగ్ రూపాన్, మరియు మారిషస్ దేశ ఉప ప్రధాని విద్యాశాఖ మంత్రి లీలాదేవి దూకన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అలాన్ గాను చేతులు మీదుగా అవార్డును ఎమ్మెల్సీ అందుకోవడం అభినందనీయం అన్నారు.ఎమ్మెల్సీ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలను అవార్డులను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.