Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కార్మికుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజు కొనసాగాయి. శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు రిలే నిరా హార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో రైతులు వెన్నెముక అయితే, భవన నిర్మాణ కార్మికులు ప్రగతి చక్రాలు అని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఇంటి నిర్మాణాలు జరిగాయంటే ఆ ఇంటి యజమానుల ద్వారా సెజ్ పేరుతో దాదాపు 300 కోట్ల రూపాయలు కార్మిక శాఖ వసూలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్ గా వచ్చిన ఈ మొత్తాన్ని కార్మికులకు కార్మిక గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కార్మికులకు ప్రమాద బీమా, ప్రసూతి, పెళ్ళికానుక, విద్యార్థులకు స్కాలర్షిప్, ప్రమాదవశాత్తు చికిత్స ఖర్చులు తదితర వాటిని కార్మిక శాఖ కార్మికులకు వర్తింపజేస్తూ ఉండేది. కానీ గత, ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం దీనికి విరుద్ధంగా కార్మికులకు చెంద వలసిన సెజ్ మొత్తాన్ని సంక్షేమ పథకాల కు ఖర్చు చేసి కార్మికులకు మాత్రం అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు చెందే విధంగా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో రాబోవు ఎన్నికలలో కార్మికులు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img