Monday, September 25, 2023
Monday, September 25, 2023

ప్రభుత్వ భూములో వేసిన గుడిసెలు తొలగింపు

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ పట్టణంలోని సర్వేనెంబర్ 668లోను మరియు జగనన్న లేఔట్ లోను గత నాలుగు రోజుల నుంచి పేదలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు వాటిని శుక్రవారం ఉదయం నుంచి తాసిల్దార్ స్వర్ణలత పరిరక్షణలో నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు వేసుకున్న గుడిసెలను తొలగించారు వీటన్నిటికీ పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించారు అనంతరం పేదలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం కావాలని అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుంటే వచ్చిన నష్టమేని తాసిల్దార్ ప్రశ్నించారు తాసిల్దార్ మాట్లాడుతూ భూమిని సర్వే చేయించి ఉన్నతాధికారుల యొక్క అనుమతితో పట్టాలు మంజూరు చేస్తామని అంతవరకు ఓపిక ఉండాలని సూచించారు ఆమె సమాధానంతో లబ్ధిదారులు సంతృప్తి చెందక మరల ప్రభుత్వ భూమిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img