Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

గుంతల మయంగా మారిన రోడ్డుని మరమ్మతులు చేయండి

విశాలాంధ్ర-గుంతకల్లు : గుత్తి బళ్లారి మీదుగా వెళ్లే పాత రోడ్డు చాలా అధ్వానంగా గుంతలు మయంగా మారిందని శనివారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాత గుత్తి హైవే రోడ్ లో సిపిఐ మండల నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవేంద్ర, మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు రోడ్డుని పరిశీలించారు. ఈ సందర్భంగా రాము రాయల్ మాట్లాడుతూ… గుత్తి నుండి బళ్లారికి వెళ్ళు పాత నేషనల్ హైవే రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని అన్నారు. దానివల్ల వాహనదారులు అదుపుతప్పి యాక్సిడెంట్లకు గురవుతున్నారని మండిపడ్డారు. తరచూ వాహనాలు అదుపుతప్పి యాక్సిడెంట్లకు గురై కాళ్లు చేతులు విరిగి మరి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన రోడ్లు మరమ్మతులు చేపట్టి ఇరుపకుల చెట్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గురుస్వామి, చంద్రశేఖర్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img