విశాలాంధ్ర -నల్లమాడ : మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాల లో విధులు నిర్వహిస్తూ బదిలీ లు, పదోన్నతి ఉపాధ్యాయులకు జీతాలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏపిటీఎఫ్ అధ్యక్షుడు చెన్నుపాటి మంజుల , ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దేవేంద్ర నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెలలో దాదాపు ,55 వేలు మంది ఉపాధ్యాయులు బదిలీ లు, పదోన్నతి జరిగిందన్నారు. రిఅపోర్షన్ ద్వారా సర్దుబాటు చేయడం జరిగిందన్నారు. వందలాది మంది హెడ్ మాస్టర్ లను రద్దు చేశారని ఆపాఠశాలలో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించి లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎంఈఓ 2 పోస్టు లు ఇచ్చారు వారికి కూడా వేతనాలు చెల్లించడం లేదన్నారు. దాదాపు రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదంటూ మొరపెట్టుకున్నారు. స్పంధించన తహశీల్దార్ పై అధికారుల తెలియజేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్, ఉపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి, నరశింహులు, రవిశంకర్,ఆది, భయాన్న , రమేష్ బాబు, తదితర లు పాల్గొన్నారు.