Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ధ్రువపత్రాల మంజూరుతో సమస్యల పరిష్కారం

జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ

విశాలాంధ్ర-రాప్తాడు : జగనన్న సురక్ష కార్యక్రమం కింద అర్హులైన వారికి 11 రకాల ధ్రువపత్రాలను మంజూరు చేయడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి, మండల నోడల్ అధికారి ఉమామహేశ్వరమ్మ అన్నారు. మండలంలోని ఎం. చెర్లోపల్లి గ్రామంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంపీడీఓ సాల్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఇంటింటా పర్యటించి సేవలను వివరించి అర్హులైన వారు నష్టపోకుండా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం వారికి ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ వెంకటేశ్వరప్రసాద్, ఏపీఎం శివకుమార్ రెడ్డి , సర్పంచ్ పసుపుల లక్ష్మీదేవి, ఎంపిటిసి బోగే లక్ష్మీదేవి, పంచాయితీ కార్యదర్శి రామాంజినేయులు, వీఆర్ఓ మనోలాల్ నాయక్, నాయకులు రామచంద్రారెడ్డి, బుడగ నాగరాజు, శేఖర్, నరసింహగౌడ్, పోతన్న, రామాంజినేయులు, పసుపుల ఆది, ఫీల్డ్ అసిస్టెంట్ కుళ్లాయప్ప, నారాంజి, రవి, కేశవయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img