Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నిర్ణీత సమయానికి రెస్టారెంట్లు మూసివేయాలి

డీఎస్పీ వెంకటశివారెడ్డి

విశాలాంధ్ర- రాప్తాడు : మండలంలో వెలసిన రెస్టారెంట్లు నిర్ణీత సమయానికి మూసివేయాలని అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటశివారెడ్డి సూచించారు. మండల పరిధిలోని రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లను రాప్తాడు ఎస్ఐ ఆంజనేయులుతో కలిసి శుక్రవారం పరిశీలించి సమావేశం ఏర్పాటు చేశారు. యజమానులు మద్యం తాగేందుకు అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మూసివేయాలన్నారు. రాత్రిపూట ఎవరైనా అనుమానస్పద వ్యక్తుల కదలికలను గమనించినట్లయితే కథలికలను పోలీసులకు తెలియజేయాలన్నారు. నిబంధనలను ఎవరైనా అధిక్రమించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img