Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

అసాధారణ ఫలితాలలో రిజ్వాన్ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్

విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో పట్టణంలోని రేగాటిపల్లి రోడ్ రిజ్వాన్ విశ్వ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అసాధారణ ఫలితాలతో ప్రభంజనం సృష్టించడం జరిగిందని పాఠశాల చైర్మన్ రిజ్వాన్ భాషా, కరెస్పాండెంట్ షేకూన్, వైస్ ప్రిన్సిపాల్ రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు అభినందన సభను ఏర్పాటు చేసి విద్యార్థుల నడుమ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 14 మంది విద్యార్థులలో 11 మంది ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత కాగా, ఒక విద్యార్థి ద్వితీయ శ్రేణిలో రావడం జరిగిందన్నారు. ఇందులో హర్షత్ కుమార్ 553, ఐశ్వర్య 544, కే. ప్రీతీ 522 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచారని తెలిపారు. తదుపరి కరెస్పాండెంట్, చైర్మన్, ప్రిన్సిపాల్ లతోపాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కలిసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img