Friday, April 19, 2024
Friday, April 19, 2024

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ లక్ష్యం..

అధ్యక్ష కార్యదర్శులు.. కృష్ణమూర్తి, రామకృష్ణ.

విశాలాంధ్ర -ధర్మవరం: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్బు యొక్క లక్ష్యమని క్లబ్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి జయసింహ, క్యాంపు చైర్మన్ నాగభూషణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈనెల 14వ తేదీన నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం కోట మున్సిపల్ పాఠశాల యందు (ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా) ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడునని వారు తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా ఆంధ్రత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి సమస్య లపై వచ్చువారు ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్, మూడు ఫోటోలు తీసుకొని రావాలని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు చిందలూరు పద్మావతి, కీర్తిశేషులు చిందలూరు సత్యనారాయణ జ్ఞాపకార్థం వీరి కుమారులు మల్లికార్జున, రాఘవేంద్ర, కేదార్నాథ్, కుటుంబ సభ్యులు (సత్య కృపా సిల్క్స్- ధర్మవరం) వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440929894 కు గాని 9441261989 కు సంప్రదించగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శివయ్య, నరేందర్ రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img