Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

చెరువుకు కాలువ తవ్వేందుకు రూ.8కోట్ల నిధులా..?

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

విశాలాంధ్ర- రాప్తాడు : మండలంలోని ఎం.బండమీదపల్లి చెరువుకు నీళ్లు ఇచ్చేందుకు తవ్విన రెండు కిలోమీటర్ల కాలువకు రూ.8కోట్లు వెచ్చించారంటే టీడీపీ నాయకులు తమ జేబుల్లోకి ఎంత వేసుకున్నారో అర్థవమవుతోందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. గురువారం ఎం. బండమీదపల్లి గ్రామంలో ఎంపీడీఓ సాల్మన్ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు. ముందుగా రూ. 40 లక్షల వెచ్చించి నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని  ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వారికి అవసరమైన వివిద రకాల ధ్రువపత్రాలు అందజేస్తున్నామన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రజల గడప వద్దకే వచ్చి ఎలాంటి సర్వీస్ ఛార్జీ లేకుండా వారికి అవసరమైన సర్టిఫికెట్లను మంజూరు చేసేందుకు సర్వే చేశారన్నారు.
స్వచ్ఛందంగా సేవ చేస్తున్న గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అర్థరహిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. టిడిపి నేతలు చేసిన అభివృద్ధి చెప్పుకునేందుకు లేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రోడ్ల వెంబడి తిరుగుతున్నారని విమర్శించారు. ఎం. బండమీదపల్లి చెరువుకు నీళ్లు ఇచ్చేందుకు రూ.2కోట్లు అయ్యే పనికి రూ.8 కోట్లు ఖర్చుపెట్టి నిధులను అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, తహసిల్దార్ లక్ష్మీనరసింహ, జెడ్పీటీసీ పసుపుల హేమావతి, ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, సర్పంచ్ ఆర్.ఉమాదేవి, కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, ఎస్సీ, బీసీ సెల్ కన్వీనర్లు నారాయణస్వామి, మరూరు ఆది, నాయకులు సుబ్బారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, పక్కీరప్ప, నరసింహారెడ్డి, డీలర్లు నాగరాజు, రంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ్, ఇతర మండలాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img