Monday, June 5, 2023
Monday, June 5, 2023

గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వము యొక్క లక్ష్యం

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వము యొక్క ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని తుమ్మల గ్రామంలో 8 లక్షల సిఎండిఎఫ్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలు భవనాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తొలుత పూజలు నిర్వహించి, తదుపరి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల కన్నా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి దిశలో తీసుకెళ్తుందని, గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించుటలో ఇప్పటికే ప్రజల యొక్క మన్ననలను పొందడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రజల వద్దకే ప్రభుత్వం ఇప్పటికే వివిధ పథకాలను చేర్చడం జరిగిందని, సచివాలయాల ద్వారా సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మమతా దేవి, డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ శివారెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతాపరెడ్డి, సర్పంచు మాలక్క,గుర్రపు శ్రీనివాసుల రెడ్డి, కాంట్రాక్టర్ జితేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img