45 మందితో నూతన కమిటీ
విశాలాంధ్ర – పెనుకొండ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో భాగా పనిచేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలను ప్రకటించింది శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించి 45 మంది సభ్యులతో కూడిన జాబితాను ప్రకటించారు పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ కు మరోసారి పార్టీ పగ్గాలు అప్పగించారు శంకర్ నారాయణ బిసి వర్గానికి చెందిన వ్యక్తి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు నియోజకవర్గాల నుంచి అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని కొత్త కమిటీని ఎంపిక చేశారు ఈ కమిటీఎంపిక పట్ల పెనుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పజెప్పినందున అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు పార్టీ కన్వీనర్లు జెడ్పిటిసిలు ఇతర కార్యవర్గం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.