Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

లోలూరు గ్రామ అభివృద్ధికి సప్తగిరి క్యాంపర్ చేయూత

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సప్తగిరి క్యాంపర్ పారిశ్రామిక వాడకు దగ్గరలో ఉన్న లోలూరు గ్రామంలో కమ్యూనిటీ డెవలప్మెంట్, మురికి కాలువల నిర్మాణం చేయడానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి సప్తగిరి క్యాంపర్ ఉపాధ్యక్షులు యూ. హనీఫ్ రూ 23.55 లక్షల చెక్కును ఆర్ డి టి చైర్మన్ తిప్పయ్య స్వామికి మంగళవారం ఆర్డిటి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంస్థ యాజమాన్యం మహేష్ రెడ్డి, శిల్పారెడ్డి సూచనల మేరకు లోల్లూరు గ్రామంలో మెరుగైన అభివృద్ధి కోసం రూ. 23.55 లక్షల మొత్తం చెక్కును ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గత సంవత్సరం సెప్టెంబర్ లో 10 లక్షల చెక్కుని అందజేశామన్నారు. పనులు పూర్తి కావడంతో ఈరోజు రూ.13.55 లక్షల చెక్కుని వారికి అందజేయడం జరిగిందన్నారు. సంస్థ ద్వారా గత సంవత్సరాలుగా అనేక సామాజిక సేవలో భాగంగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్ డి టి రిసోర్స్ మొబిలైజేషన్ డైరెక్టర్ సాగర మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img