విశాలాంధ్ర-రాప్తాడు : దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీడీఓ సాల్మన్ అన్నారు. ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీన జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రాప్తాడులో మంగళవారం ర్యాలీ చేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, దేశ ప్రజలను ఐక్యతా భావన వినిపించిన ఆదర్శనీయుడన్నారు. నాటి నుండి స్వేచ్ఛా, స్వాతంత్రం ఫలాలను మనమందరం పొందుతున్నామన్నారు. ఆయన భారత హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశంలోని 565 సంస్థానాలను భారత ప్రభుత్వంలో ఆయన విలీనం చేయడం జరిగిందనీ, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయుటకు నాంది పలికారన్నారు. అనంతరం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ మునివేలు, డీటీ లక్ష్మీనర్సింహ,
ఈఓఆర్డీ నరసింహారెడ్డి, సర్పంచ్ సాకే తిరుపాలు, పంచాయతీ కార్యదర్శులు పెద్ద శ్రీనివాసులు, రమణారెడ్డి, వీఆర్ఓ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.