విశాలాంధ్ర- ధర్మవరం : 28వ వార్డు కేతిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి కాలనీ యందు రామాలయ నిర్మాణం కోసం తన వంతుగా 50వేల రూపాయల విరాళమును అందజేస్తున్న అందజేసినట్లు 28వ వార్డు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ నాయకుడు సరితాల భాష తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణాలు మంచి మార్గాలకు నిదర్శనం అని తెలిపారు. ప్రతి వ్యక్తి దైవభక్తిని అలవర్చుకుంటే చక్కటి మనశ్శాంతితో మంచి జీవితాన్ని గడపవచ్చునని తెలిపారు. అనంతరం రామాలయ కమిటీ వారు సరితాల భాషకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.