Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి

రిజ్వాన్ భాషా
విశాలాంధ్ర – ధర్మవరం : ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాడు స్థానిక శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన విద్యార్థులతో కలిసి కేకు కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సంధర్భంగా రిజ్వాన్ భాషా మాట్లాడుతు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని తరాలకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనదని, దానిని కాపాడుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. విద్యార్థులను వారి స్థాయిని బట్టి మంచిగా తీర్చిదిద్దుతూ సమాజానికి మంచి పౌరుడుగా అందించాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్య నేడు ఎంతో అవసరమని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల ఏవో కరిముల్లా, ఎన్ఎస్ ఎస్పీవో. హర్షవర్ధన్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img