Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

జిల్లా వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలను కాపాడండి

తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి

ఏపీ రైతు సంఘము అనంతపురము జిల్లా ప్రధాన కార్యదర్శి డి. చిన్నప్ప యాదవ్
విశాలాంధ్ర- ఆత్మకూరు : ఏపీ రైతుసంఘము ఆధ్వర్యంలో ఈరోజు నుంచి ఈ నెల 27వ తారీకు వరకు జిల్లా వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలను రైతు సంఘం నాయకులు రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించడం జరుగుతుంది.ఈనెల 28వ తారీఖున సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల దగ్గర జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను కరువు మండల ప్రకటించాలని నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆత్మకూరు మండలం సనప గ్రామములో ఎండిపోయిన పంట పొలాలను వేరుశనగ జొన్న తదితరపంటలనురైతుసంఘము, సిపిఐనాయకులు కలిసి పరిశీలిస్తూ
డి.చిన్నప్ప యాదవ్ మాట్లాడూతూ…జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల హెక్టార్లలో వేరుశనగ, పత్తి ,కంది ,జొన్న, కొర్ర, ప్రొద్దుతిరుగుడు, సజ్జ ,తదితర పంటలు సాగు చేయడం జరిగినది ఖరీఫ్ లో వేరుశెనగ పంట వేసీ దాదాపుగా రెండు నెలలు కావస్తుంది వేసినప్పటి నుంచి వర్షం లేక వేసిన అన్నిరకాలపంటలన్నీ ఖరీఫ్లో ఎండిపోతున్నాయి వేరుశనగ 30 రోజుల్లోనే పూత దశ 45 రోజులకి ఊడ దశ చేరుకుంటుంది కానీ ఇప్పటికే 45 రోజులు దాటిపోయింది కానీ వర్షం లేక పూర్తిగా వేరుసెనగకూడా ఎండిపోయింది దాని వల్ల ఇప్పటికే ఎకరాకి 20,000 వేలు పై వరకు రైతులు వేరుశనగ పంటకు పెట్టి నష్టపోయినాముఅనిరైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇతర పంటలు కూడా వర్షం లేక పూర్తిగా ఎండిపోతున్నాయి అందుకే తక్షణమే ఎకరాకి 25 వేల రూపాయలు నష్టపరిహరము చెల్లించాలని తదనంతరం కరువు సహాయక చర్యలు చేపట్టాలి, సామూహిక స్పింక్లర్లు ఏర్పాటు చేసి బోరుబావులున్న రైతులతో ఏండి పోతున్నపంట పొలాలకు నీరు ఇప్పించేటట్లుప్రభుత్వమే కార్యక్రమాలు చేపట్టాలి, ట్యాంకర్ ల ద్వారా పంట పొలాల ఎండిపోకుండా నీటిని ఉచితంగా,సప్లై చేయాలని లేకుంటే రైతులుపంటపోలాలువదలి వలసలు పొయేప్రమాదం ఉంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా పాల్పడే ప్రమాదం ఉంది అందుకే జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ఈ క్రాప్ తో పాటుఏండిపోయిన పంట పొలాలు పరిశీలించి సమగ్రమైన సర్వే చేసి జిల్లా అధికారుల నివేదికల పంపి ప్రభుత్వం నుంచి నష్టపరిహారము పంటల బీమా వచ్చే విధంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో
ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సనప నీళ్లపాల రామకృష్ణ, సిపిఐ రాప్తాడు నియోజకవర్గం సహాయ కార్యదర్శి జి, శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు బి రామాంజనేయులు, రైతులు నాగేంద్ర, శైలజ ,ఈశ్వరయ్య, తాతయ్య, , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img