Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎన్ బి ఎ కమిటీ రెండవ రోజు పరిశీలన

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల నేషనల్ బోర్డ్ అఫ్ అక్రిడేషన్ కమిటీ రెండవ రోజు సివిల్ , కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలను శనివారం పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి సుజాత తెలిపారు.విద్యార్థుల తల్లి దండ్రులతో అల్యూమిని సభ్యులతో ముఖాముఖిగా పలు అంశాలపై అధ్యయనం చేశారు.పరిశోధన పరికరాలు, సిలబస్ రూపకల్పన, నియామకాలు, ఎన్ఎస్ఎస్, ఎన్ సి , వివిధ దస్త్రాలను, మొదలగు అంశాలను క్షుణ్ణంగా చూశారు. అనంతరం ఉపకులపతి ఆచార్య జి. రంగ జనార్ధన , పీర్ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య యం. విజయకుమార్ , రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ ,డి ఈ ఆచార్యఇ. కేశవ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. భవాని , కెమికల్ విభాగధిపతి డాక్టర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img