Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

సచివాలయ వాలంటీర్ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 25వ వార్డులో గల సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వైష్ణవి అనే వార్డ్ వాలంటరీ జన్మదిన వేడుకలను కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కౌన్సిలర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ అనేది నేటి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వాలంటరీ వ్యవస్థలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎంతగానో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఆ సమస్యల పరిష్కారంలో సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర వహించడంతోనే, తాను ఈ జన్మ దిన వేడుకలను సచివాలయంలో చేయడం జరిగింది అని, ఇందుకు నాకు ఎంతో సంతృప్తి ఉందని తెలిపారు. నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థలో ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img