Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఆదిత్య పాఠశాలను సీజ్ చేయండి.. ఏఐఎస్ఎఫ్ నాయకులు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఆదిత్య పాఠశాలలో సీజ్ చేయాలని కోరుతూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య, నియోజకవర్గ అధ్యక్షులు శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్, మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్న ఆదిత్య పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వానిబంధనలు తుంగలోకి ఇష్టానుసారంగా బుక్స్ యూనిఫామ్ అని, రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కనీసం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా పాఠశాలలో ఫీజులు ఎక్కువ శాతం వసూలు చేయడం జరుగు తున్నదని తెలిపారు. అదేవిధంగా ఆ యొక్క పాఠశాలలో కనీస విద్యార్థులకు ఆడుకోవడానికి సరైన ఆటస్థలం కూడా లేకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా మరి ఒక పాఠశాలలో నోటీస్ బోర్డ్ నందు తరగతులు వారిగా విద్యార్థులు ఫీజు కట్టవలసిన వివరములు లేవని, నోటీసు బోర్డు లో తెలపకుండా విద్యార్థుల తల్లిదండ్రులు మభ్యపెట్టి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి తక్షణమే పాఠశాలను సీజ్ చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసాగా నిలవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు జయవర్ధన్, గణేష్, మహేష్, ఖలీల్ అహ్మద్,మురళి, అజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img