విశాలాంధ్ర – చాగలమర్రి : చాగలమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన అమన్,సమీర అనే విద్యార్థులు అండర్ – 17 విభాగం,పండు అనే విద్యార్థి అండర్ -14 విభాగంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు కోటయ్య తెలిపారు.బుధవారం పాఠశాలో జరిగిన అభినందన సభలో హెచ్‌ఎం మాట్లాడుతూ ఈ నెల 25 న కర్నూలు బిక్యాంపు ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ లో పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.వీరు త్వరలో గుంటూరు జిల్లా తెనాలి లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.కార్యక్రమంలో వ్యాయామ సంచాలకులు దాదాపీర్,పిఈటి భారతి,ఉపాధ్యాయులు శాస్త్రి,రవీంధ్రారెడ్డి,శ్రీనివాసులు,రాజశేఖర్ రెడ్డి,బాబు,మోహన్‌రాజు,దేవమణి తదితరులు పాల్గొన్నారు.