Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నిరుపేదల వృద్ధుల కోసం సేవా కార్యక్రమం

డాక్టర్ సత్య నిర్ధారన్
విశాలాంధ్ర – ధర్మవరం : స్వచ్ఛంద సంస్థలకు నిరుపేదల వృద్ధుల కోసం ఆహార కొరత తీర్చడానికి కేవలం ఐదు రూపాయలకే ఒక ఇడ్లీని పంపిణీ చేస్తున్నామని రెడ్ క్రాస్ మెంబర్ వేణుగోపాల్, డాక్టర్ సత్య నిర్ధారన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఒక సరికొత్త ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని తాత గారి హోటల్ యందు వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఒకరోజు ముందుగా ఇడ్లీల కొరకు ఆర్డర్ వేస్తే తాము అందించగలమని తెలిపారు. నిరుపేదల ఆకలి తీర్చడానికి, స్వచ్ఛంద సంస్థల్లో ఉన్న వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని స్వచ్ఛంద సంస్థలు వినియోగించుకోవలసినదిగా వారు తెలిపారు. తాము చేసే ఇడ్లీ యందు సోయాబీన్స్ అనే పౌష్టిక ఆహారము కూడా చేర్చడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img