Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎన్ఎస్ఎస్ ద్వారా మెడికోల సేవలు ప్రశంసనీయం

వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : వైద్య కళాశాలలో గత నాలుగు సంవత్సరాలుగా ఎన్ఎస్ఎస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ఇప్పుడు హౌస్ సర్జన్ కు వెళుతున్న 2కె 18 బ్యాచ్ విద్యార్థులకు, ఫైనల్ ఇయర్ కు వెళుతున్న బ్యాచ్ వైద్య విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ సీనియర్ వాలంటీర్ల వీడ్కోలు కార్యక్రమాన్ని ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ మా కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ఎంబిబిఎస్ చదువుతున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహకారంతో నిర్వహించామని, ముఖ్యం గా కోవిడ్ సమయంలో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ కాన్సెంట్రేట్లను మా వైద్య విద్యార్థులు అందించి ఎంతోమందికి ప్రాణదాతలు అయ్యారని, హాస్పిటల్ లో ఎప్పుడు ఎవరికీ రక్తం అవసరం ఉన్న వెంటనే స్పందించి రక్తదానాన్ని చేసి ప్రాణాలు కాపాడుతున్నారన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించి మెడికల్ కళాశాలను పచ్చదనంతో నింపడంలో మీ వంతు పాత్ర అభినందనీయమని తెలిపారు. దత్తత తీసుకున్న సిద్ధరాంపురం గ్రామంలో మీరు చేసిన సేవలు ప్రశంసనీయమని ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆచార్య శ్రీదేవి, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ కేఎల్ సుబ్రమణ్యం, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు భారతదేశ ప్రభుత్వం తరఫున డాక్టర్ వైయస్ ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అందించే ఎన్ఎస్ఎస్ ప్రశంసా పత్రాన్ని 240 గంటలు ఎన్ ఎస్ ఎస్ కోసం పనిచేసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img