Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మన్యం జిల్లాలో ఏడుగురు ఉద్యోగుల సస్పెండ్

*జిల్లా విద్యాశాఖాధికారితో పాటు ఇద్దరు మండల విద్యాశాఖాధికారులు


విశాలాంధ్ర – పార్వతీపురం,సీతమ్మపేట : పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు పలు మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మన్యం జిల్లా డిఇఓ డాక్టరు ఎస్ డివి రమణను, వీరఘట్టం, సీతమ్మపేట మండలాల విద్యాశాఖ అధికారులను, కెజిబివి ప్రిన్సిపాల్, మరో ముగ్గురు ఉపాధ్యాయు లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వివరాలు పరిశీలిస్తే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మన్యంజిల్లాలోని వీరఘట్టం మండలంలోని రేగులపాడు కెజిబివిను, పాలకొండ మండలం కొండాపురం పాఠశాలను, సీతమ్మపేటలోని ఉన్నత పాఠశాలను, సీతమ్మపేట మండలంలోని మర్రిపాడు ప్రాధమిక పాఠశాలను, భామిని మండలంలోని ఉన్నతపాఠశాలను ఆకస్మికతనిఖీలు నిర్వహించారు. దీంతో ఆయా పాఠశాలలో పలు లోటుపాట్లును గుర్తించి దీనికీ బాధ్యులైనజిల్లా విద్యాశాఖాదికారితోపాటు వీరఘట్టం ఎంఇఓ పి.కృష్ణమూర్తి, జిల్లా అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రోజారమణి, కెజిబివి ప్రిన్సిపాల్ రోహిణి,సీతమ్మపేట ఎంఈఓ ఆనందరావు,మర్రిపాడు ఎంపీపీ పాఠశాల హెచ్ఎం రామినాయుడు, భామిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో పనిచేసిన గణిత ఉపాధ్యాయుడు రాంబాబులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.వీరఘట్టం మండలం రేగులపాడు కెజిబివి రెషిడెన్షియల్ పాఠశాల విద్యార్ధినులకి నవంబరులో ఇవ్వాల్సిన రెండవ సెమిస్టర్ లెక్కల పుస్తకాలని నేటికీ పంపిణీ చేయకపోవడం,మర్రిపాడు పాఠశాలలో సగంమంది విద్యార్థులు బెంచీలమీద, సగంమంది విద్యార్థులు నేలమీద కూర్చోవడంపై అసంతృప్తి , పిల్లలు ఏకరూప దుస్తులు ధరించక పోవడం,విద్యాబోధన సక్రమంగా లేకపోవడం, వర్క్ బుక్స్ విద్యార్థులచేత రాయించకపోవడం, పాఠశాలలో త్రాగునీటి ప్లాంట్ పనిచేయపోవడం, గడువుతేది ముగిసిన చెక్కీలు పాఠశాలలో ఉండడం,భామిని జడ్పి ఉన్నత పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు సిలబస్ పూర్తి చేయకపోవడం, విద్యార్థుల చేత వర్క్ బుక్ రాయించకపోవడం వంటి కారణాల వల్ల ఏడుగురును సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పుస్తకాల పంపిణీపై నెలరోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయాలని సీతమ్మపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కల్పనాకుమారి నీ ఆదేశించారు.పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారిగా విశాఖపట్టణం రీజనల్ జాయింట్ డెరైక్టర్ జ్యోతికుమారికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కల్పన కుమారి, పాలకొండ సబ్ కలక్టర్ నూరుల్ కమల్ జిల్లాల్లోని అధికార యంత్రాంగం పాల్గొన్నారు. జిల్లాపర్యటన ముగిసే సమయంలో భామిని మండలంలో జిల్లా కలక్టర్ నిషాంత్ కుమార్ పాల్గొని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పలు అంశాలపై చర్చించారు. జిల్లాలోని
డిఈఓ, ఇద్దరు ఎంఈఓలు, నలుగురు ఉపాధ్యాయులను ఒకేదపా సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయసంఘాలనేతలు దేనిపై అమీ తుమీ తేల్చుకోవడానికి రంగం సిద్దం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img