Friday, December 8, 2023
Friday, December 8, 2023

ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధిని చూపెట్టండి

జిల్లా విజిలెన్స్ అధికారి రమణారెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధిని చూపాలని జిల్లా విజిలెన్స్ అధికారి రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఎంపీడీవో కార్యాలయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన పనులను వారు ప్రజావేదిక ద్వారా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన రూ.10,34,76,318 లను ఖర్చు చేయడం జరిగిందన్నారు. గత నెల 19వ తేదీ నుండి నేటి వరకు తనిఖీలు నిర్వహించి నాడు ఓపెన్ ఫార్మ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆడిట్ అధికారి కాంతయ్య,, డిఆర్డిఏ పెన్షన్ ఏపీఓ శివమ్మ, ఎంపీడీవో సౌజన్యకుమారి,, ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
సైన్ బోర్డ్ విడుదల:: మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామ సచివాలయంలో గురువారం నాడు ఆంధ్ర ప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపీటీసీ రమాదేవి,వైస్ ఎంపీపీ చిన్న కృష్ణారెడ్డి, విస్తరణాధికారి మమతాదేవిలు ఆవిష్కరించారు. అనంతరం ఆ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ రామయ్య, పోతుల నాగేపల్లి, సీసీ కొత్తకోట- గ్రామ ప్రజలు,నాయకులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img