Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

టీఎస్ ఎంసెట్ ఫలితాలలో శ్రీ విశ్వ విజేత విద్యార్థుల ప్రభంజనం

విశాలాంధ్ర-తాడిపత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలచిన ఎంసెట్ ఫలితాలలో పట్టణంలోని జయ నగర్ కాలనీ ఏడవ అడ్డరోడ్డులో ఉన్న శ్రీ విశ్వ విజేత కోచింగ్ సెంటర్ విద్యార్థులు ప్రభంజనం చూపారని శ్రీ విశ్వ విజేత కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కందుల నరేష్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ తమ కోచింగ్ సెంటర్ విద్యార్థులు కె.పి. విష్ణు 69 మార్కులు 12,207 ర్యాంకు, జే. రంగా సర్వేష్ 67.5 మార్కులు 14,406 ర్యాంకు ఏ. లోకేశ్వర్ రెడ్డి 66.34 మార్కులు14,966 ర్యాంకులు సాధించారు. అంతేకాకుండా తమ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న దాదాపు 40 మంది విద్యార్థులు మంచిర్యాంకులు సాధించారని ఉత్తమమైన కాలేజీలో సీటు సాధిస్తారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img