Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చిరు వ్యాపారస్తులు ధర్నా

విశాలాంధ్ర – ధర్మవరం:: నూతన కాయగూరల మార్కెట్ వద్ద చిరు వ్యాపారస్తులు సోమవారం ఉదయం ధర్నాను నిర్వహించడం జరిగింది. ప్రతి సోమవారము వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి తెచ్చిన కాయగూరలను విక్రయించడానికి తరాలుగా తాము వస్తున్నామని, మున్సిపల్ అధికారులు మమ్ములను అడ్డుకోవడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ ధర్నా నిర్వహించడంతో చివరిగా వన్ టౌన్ పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు తగు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దుర్గమ్మ గుడి ముఖ ద్వారం వద్ద నుంచి ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉండడంతోనే తమను పెట్టవద్దని చెప్పడం జరిగిందని, అట్లు కాకుండా చర్చ్ నుంచి పోస్ట్ ఆఫీస్ లో గల ప్రదేశాలలో తమరు వ్యాపారాలు చేసుకోవచ్చని చిరు వ్యాపారస్తులకు తెలియజేశారు. దీంతో బాధితులు వెని తిరిగి వెళ్లారు. కానీ మున్సిపల్ మార్కెట్లో లక్షల్లో డిపాజిట్ కట్టి వేళల్లో బాడిగా కట్టే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉందని మరికొంతమంది వాపోయారు. దీంతో సరైన నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేయకూడదు జరుగుతుందని పోలీసులు సద్ది చెప్పడంతో బాధితులు వెళ్లిపోయారు. చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ వారంలో ఒకరోజు అయిన సోమవారం తాము పండించిన కాయగూరలను విక్రయించడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందని, అప్పుడు లేని ఆటంకం ఇప్పుడు ఎలా వచ్చిందని వారు నిలదీశారు. మేము ప్రతిరోజు రాముగా…. కేవలం సంతరోజైన మాత్రమే రాగలమని తెలిపారు. మా వ్యాపారాలు జరగకపోతే కుటుంబ పోషణ భారమైతుందని బాధితులు వెల్లిబుచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img