Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సాంఘిక చైతన్య విప్లవ జ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌

అనంతపురం – విశాలాంధ్ర శెట్టూరు : మన దేశానికే కాదని, యావత్‌ ప్రపంచానికి ఆదర్శంగా అణగారిన ప్రజానీకానికి ప్రశ్నించేతత్వానికి రూపకల్పన చేసిన సాంఘిక చైతన్య విప్లవ జ్యోతిగా, మహోపాధ్యాయుడుగా నిలిచిన ఘనత భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కే సాధ్యమైందని. వెటర్నరీ డాక్టర్ ప్రసాద్, దళిత యువ నాయకుడు ఎమ్మెస్ హనుమంత రాయుడు పేర్కొన్నారు.
అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి,
ఘన నివాళులు అర్పించారు మాట్లాడుతూ. అంబేడ్కర్‌ తన జీవితమంతా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాలను ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు నిరుపేదల అభ్యున్నతి కోసం, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి, ఎప్పటికీ అమరత్వాన్ని పొంది ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. నిజానికి అంబేడ్కర్‌ ఏదో ఒక అస్తిత్వానికి చెందినవాడు కాదని అందరివాడుగా చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా లిఖించబడ్డారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం సర్దానప్ప, టైలర్ వన్నూరు స్వామి, గౌరయ్య, వై మోహన్,
పి ఎల్ తిప్పేస్వామి, బొగ్గుల దుర్గేష్, శ్రీనివాసులు, హరికృష్ణ, బసవేశ్వర,రాము, లింగమయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img