Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అంతర జిల్లాల సాఫ్టుబాల్ పోటీల్లో విజయంతో తిరిగిరావాలి

ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీదేవి

విశాలాంధ్ర-రాప్తాడు : అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో ఈనెల 26,27,28 తేదీలలో జరగనున్న జూనియర్ సాఫ్ట్బాల్ అంతర్ జిల్లాల టోర్నమెంటులో అనంతపురం జిల్లా జట్టు విజయంతో తిరిగి రావాలని ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీదేవి ఆకాంక్షించారు. అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో జరుగుతున్న సాఫ్టుబాల్ కోచింగ్ క్యాంప్ ముగింపు సందర్భంగా బుధవారం క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఆర్డీటి స్పోర్ట్స్ సెంటర్ మేనేజర్ శ్రీదేవితోపాటు ఏపీ సాఫ్టుబాల్ సీఈఓ సి.వెంకటేశులు, రాష్ట్ర కార్యదర్శి సి. నాగేంద్ర, సీనియర్ పీడీలు ప్రభాకర్, గోపాల్ రెడ్డి, చంద్ర హాజరయ్యారు. సీఈఓ మాట్లాడుతూ ఏపీలో సాఫ్ట్బాల్ క్రీడ అభివృద్ధి కోసం ఆర్డిటి చేస్తున్న సహాయ సహకారాలు ఎనలేనివని వారి సహాయ సహకారాలతోనే నేడు జాతీయస్థాయిలో సాఫ్ట్బాల్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూఫెర్రర్ సహాయసహకారాలతోనే సాధ్యమైందన్నారు. అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ సాగించిన మీరు విజయముతో తిరిగి వచ్చినప్పుడే ఈ కష్టానికి ఫలితం ఉంటుందన్నారు. తెలియజేశారు. స్పోర్ట్స్ సెంటర్ మేనేజర్ శ్రీదేవి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలతోపాటు చదువుకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సాఫ్ట్బాల్ క్రీడాభివృద్ధి కోసం వెంకటేశులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్రీడాకారులందరూ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని అప్పుడే మంచి క్రీడాకారులుగా తయారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు సాయిదీక్షిత్, మహేష్, సింహాద్రి, లక్ష్మీకళ్యాణ్, లక్ష్మి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img