Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సోలార్ తో కలుపు మొక్కల నివారణ యంత్రం రూపకల్పన. 

విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ: మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్   మెకానికల్ ఇంజనీరింగ్ విభాగము విద్యార్థులు   సోలార్ ఆపరేటెడ్ కలుపు నివారణ మెషిన్ ను తయారు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ మెషిన్ ను మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరము చదువుతున్న మణికంఠ, చిన్నారావు లు అతి తక్కువ ఖర్చు తో ఈ మెషిన్ ను సూళూరుపేట కు చెందిన నరేంద్ర అను  రైతు కు కావలసిన విధంగా విద్యార్థులు తయారుచేసి ఇచ్చినట్లు ఆయన అన్నారు. ఈ ఆటోమేటెడ్ సోలార్ కలుపు నివారణ మెషిన్ అనేది పూర్తిగా సౌర శక్తితో నడిచేది అని అన్నారు. ఇది కొద్దీ స్థాయిలో మట్టిని కూడా గొర్రు గుంటక కు ఉపయోగ పడుతుందని, ఎక్కువగా టమోటా, ప్రత్తి, మిరప మొదలైన పంటలలో ఉపయోగ పడుతుందని అని అన్నారు. ఇందులో సోలార్ ప్యానెల్ 40 వాటేజ్, 24 వోట్ల్స్ మోటర్ మరియు 7ప బ్యాటరీలను ఉపయోగించి, రెండు చక్రాలతో నడిచే విధంగా దీనిని తయారుచేసినట్లు ఆయన అన్నారు.  రైతులకు కావలసిన ఎంటువంటి పరికరనైనా అతి తక్కువ ఖర్చుతో తయారుచేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ సోలార్ ఆపరేటెడ్ కలుపు నివారణ మెషిన్ ను తయారు చేయుటకు విభాగాధిపతి ఆచార్య ముప్పు లక్ష్మణరావు ఆద్వర్యం లో తయారుచేసినట్లు తెలిపారు. తయారు చేసిన విద్యార్థులను , విభాగాధిపతి ని కళాశాల కరెస్పాండెట్ డాక్టర్. యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, అసోసియేట్ డీన్ ఆర్ డ డి తులసీరామ్ నాయుడు అభినందించారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img