విశాలాంధ్ర-తాడిపత్రి: ఎర్రగుంటపల్లి, తేరన్న పల్లి తదితర గ్రామాలకు మంచినీటి సమస్యను పరిష్కరించాలని సర్పంచులు యుగంధర్, రవిచంద్ర చౌదరి గురువారం తాసిల్దార్ మునివేలుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయిబాబా పథకం కింద తమ గ్రామాలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు. కానీ గత వారం రోజుల నుండి సత్య సాయి బాబా మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు వారికి రావలసిన జీతభత్యాలు, సమస్యల పైన సమ్మె చేస్తున్నారు. దీంతో మా గ్రామాలకు నీటి సరఫరా నిలిచి పోవడంతో గ్రామాల్లోని ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మా గ్రామాలకు నీటి సమస్యను పరిష్కరించి, సత్య సాయి బాబా మంచి నీటి సప్లై కార్మికులకు వారి సమస్యలను పరిష్కరించే మార్గం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.