Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

జిల్లా డిఎస్పి లతో ఎస్పీ సమీక్ష సమావేశం

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని డీఎస్పీలతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో సమావేశమయ్యారు. పలు కేసులను సమీక్షించారు. పలు ఆదేశాలు జారీ చేశారు.
చీటింగ్ కేసుల పెండెన్సీ తగ్గించాలన్నారు. దర్యాప్తు పూర్తీ చేసి చార్జిషీటు వేసి కోర్టుల్లో నంబర్లు తీసుకోవాలన్నారు.
రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ల కదలికలపై నిఘా ఉంచాలి. వీరికి సంబంధించిన కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తీ చేయాలి అని పేర్కొన్నారు.
గత ఎన్నికలలో నమోదైన కేసుల్లో ఏవైనా పూర్కీ కాకుండా ఉంటే వెంటనే దర్యాప్తు పూర్తీ చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన చోదకులకు అవగాహన చేసే కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు.
దొంగతనాల కేసులను ప్రాధాన్యతగా తీసుకుని ఛేదించడంతో పాటు రికవరీలు కూడా పెంచాలి అని పేర్కొన్నారు.
సి.ఐ ల, ఎస్సైలకు ఈ ఆదేశాలను చేరవేయాలని… పక్కాగా అమలు పరిచి త్వరితగతిన పరిష్కారం చూపాలిఅన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు సి.ఎం గంగయ్య, యు.నరసింగప్ప, జి.ప్రసాదరెడ్డి, బి.వి శివారెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img