డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్.
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 30వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ధర్మవరం ఆర్టీసీ డిపోలో అరుణాచలం కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం ఐదు గంటలకు ధర్మవరం నుండి కాణిపాకం మీదుగా అరుణాచలం గిరి ప్రదర్శన, శివుని దర్శనం చేసుకుని, తిరుగు ప్రయాణంలో వేలూరు గోల్డెన్ టెంపుల్ మీదుగా కంచి దర్శించుకుని, నేరుగా ధర్మవరం రావడం జరుగుతుందని డిపో మేనేజర్ తెలిపారు. పై చరిత్రలు దర్శించుకుని వచ్చుటకై రానుపోను చార్జీలు ఎక్స్ప్రెస్ బస్సు కు 1200 రూపాయలు, సూపర్ లగ్జరీ బస్సు కు రాను పోను 1600 రూపాయలు ఉంటుందని తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ ఆన్లైన్ సౌకర్యం కూడా కలగని మరిన్ని వివరాలకై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్. 7382860947 కు సంప్రదించాలని తెలిపారు.కావున భక్తాదులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా వారు తెలిపారు.