విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు బుధవారం జనసేన కార్యకర్తలు ఊరివాకిల ఆంజనేయస్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేరిట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో 116 కొబ్బరికాయలు కొట్టారు.
ఈనెల 14 నుండి అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే “వారాహి యాత్ర”కు ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా, దిగ్విజయంగా ముందుకు సాగాలనే. మహా సంకల్పంతో వారాహి యాత్ర ఘనవిజయం కావాలని 116 టెంకాయలు కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల మండల అధ్యక్షులు లోకేష్ శ్రీదేవి ,పద్మావతి. నియోజకవర్గం నాయకులు రాజేష్ ,బంగారం, రమేష్ ,బాబా ఫక్రుద్దీన్ ఆకుల రమేష్ , నవీన్ కుమార్ , ప్రసాద్ మారుతి , ప్రసాద్ ,సిసింద్రీ , మల్లేష్ , సుజిత్ , సుధాకర్, బాబు, బాలు ఈ కార్యక్రమానికి తదితరులు పాల్గొన్నారు.