విశాలాంధ్ర -బొమ్మనహల్: మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం మొదటి శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయాన్నే దేవుడి భావి దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జలాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి జలాభిషేకం చేశారు అనంతరం లక్ష పత్ర తులసి ఆకులతో ప్రత్యేకంగా అలంకరించారు పుష్పాలంకరణ పంచామృతాభిషేకం ఆకు పూజ తదిత ర ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుండి వందలాది మంది భక్తులు హాజరై వారి మొక్కలు తీర్చుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి నరసింహారెడ్డి ఆలయ సిబ్బంది ఓబన్న సర్పంచ్ పరమేశ్వర ఎంపీటీసీ చిక్కన్న మాజీ ఆలయ ధర్మకర్తలు వన్నూరు స్వామి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు