Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ధర్మవరం పట్టణంలో స్పెయిన్ బాస్కెట్ బాల్ కోచ్ లతో ప్రత్యేక శిక్షణ


విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలో ఆర్ డి టి (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) సహకారంతో ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పెయిన్ దేశానికి చెందిన ఁఈగల బాస్కెట్ బాల్ క్లబ్ఁ కు సంభందించిన బాస్కెట్ బాల్ కోచ్ లు మౌర్, ఒరియోల్, నటాలియా, పోల్ తదితర అంతర్జాతీయ స్థాయి కోచ్ లతో మంగళవారం న స్థానిక ధర్మవరం పట్టణ కాలేజీ మైదానం నందు గల బాస్కెట్ బాల్ కోర్టులో ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ శిబిరం ధర్మాంభ బాస్కెట్ బాల్ క్రీడాకారులకు కొనసాగుతుందని ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని బాస్కెట్ బాల్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పెయిన్ బృందం వారు బాస్కెట్ బాల్ క్రీడాకారులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్ క్రీడాకారులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణకు సహకరించిన జిల్లా అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి,కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా, కోచ్ సంజయ్, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img