Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘ ఉంచాలి

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘాను ఉంచాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ లో సీజ్ చేయబడిన వాహనాలను వాటి వివరాలు గురించి సీఐ రాజా ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా, క్రయవిక్రయాలు, నిరంతర నిఘా విధిగా కొనసాగించాలని సూచించారు. పట్టణంలోని వివిధ సర్కిల్స్ లలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి చెడు ప్రభావం, వాటిని వినియోగించిన వారికి విధించే శిక్షణ గురించి వివరించారు. తదుపరి వాటిని వినియోగించిన వారికి విధించే శిక్షల గురించి, పెద్ద పెద్ద హోల్డింగ్లు ఏర్పాటు చేసి, ప్రజలకు, విద్యార్థులకు వాటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్డిపిఎల్ కేసులలో ఎర్రచందనం, అక్రమ రవాణా కేసులలో పెండింగ్ లో ఉన్న వారెన్ టలను అమలు పరచాలని, టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల పై ప్రత్యేక దృష్టి సారించి, వారి అనునిత్యం కార్యకలాగా పై నిరంతర నిఘ కొనసాగించాలని తెలిపారు. నైట్ బిట్స్ బాగా పెంచి, స్టేషన్ పరిధిలో జరిగే రెగ్యులర్ క్రైమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మట్కా, జూదం, అక్రమ మద్యం తయారీపై నిఘా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాలు, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని తెలిపారు. స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వారికి తగిన సేవలు అందిస్తూ, న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసులు, టూ టౌన్ సీఐ రాజా తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img